Friday, November 20, 2009

స్నేహం

ఏ విషయమైన కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది కానీ , స్నేహం మాత్రం పాతబడిన కొద్ది బాగుంటుంది. చెలిమికి ఉన్న సుగుణం . చిరకాలం నిలిచే వసంతం. ప్రయోజనాలతో స్నేహం ముడిపడి ఉండదు. ఒక వేళ దగ్గరైన ప్రయోజనాలు నెరవేరక దూరం జరుగుతారు. కానీ స్నేహం ఇచ్చిపుచ్చు కోవడాలు కన్నా అతీతమైనది.

స్నేహం చేయడానికి తర్ఫీదు ఉండదు. శిక్షణ కోర్సులు ఉండవు. స్నేహంగా ఉండాలన్న తపన ఉండాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది వినగలిగే ఓర్పు ఉండాలి. మనసులో మాట చెప్పుకోగలగాలి. అలాంటప్పుడే స్నేహం ఎదుగుతుంది.
ఏదైనా పని ఉంటే తప్ప పలకరింపులు లేని ప్రపంచంలో స్నేహం అంత సులువు కాదు. కరుణ , మనుషులను అర్ధం చేసుకోగలిగే ఓర్పు, క్షమా గుణం ఉండాలి.

ఎదుటి మనిషి లో లోపాలు ఎంచడం కాకుండా ఆ మనిషి అలాఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోగలిగే సహనం ఉండాలి. ఇలాంటివారు ఇతరులపట్ల సున్నిత హృదయంతో స్పందిస్తారు. ఇది స్నేహానికి అవసరమైన లక్షణం. ఇంతటి ఉదాత్త ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఆ చెలిమి అపూర్వం.

6 comments:

  1. చాల బాగా చెప్పారండీ .ఇప్పుడే మీవి పాతవన్నీచదివాను "అణిముత్యాల్లాంటి " రాతలు .

    ReplyDelete
  2. బాగుంది. స్నేహమనేది గొప్ప వరం కదా

    ReplyDelete
  3. బాగుంది మీ విశ్లేషణ. స్నేహితులు లేని జీవితం రసం లేని చెరుకు వంటిది.

    ReplyDelete
  4. నిజం !
    శూన్య జీవన గమనంలో కూడా
    నిరంతర అమృత ధార స్నేహం!

    ReplyDelete
  5. na sneham mee andariki nachinanduku dhanyavadalu.

    bujji garu sneham leni jeevetam pulu leni thota vantidi.

    ReplyDelete