Friday, October 2, 2009

ఉత్తరం

ఒక మిత్రుడో/ మిత్రురాలో ఉత్తరం రాస్తే అది చేరడానికి కొన్ని రోజులు, తిరిగి మనం ఒకొక్క వాక్యమే పేర్చుకొంటూ జాబు రాస్తే మరికొన్ని రోజుల్లో వాళ్ళకందేవి.

మళ్లీ ఉత్తరం కోసం ఎదురుచూడడం అందులో మనకోసం అమరిన అక్షరాలు , మనల్ని ఉద్దేశించిన భాష , మనం లక్ష్యం గా సాగిన భావన ఎంత వింతైన అనుభుతిలిస్తాయోకదా !

పాతవి అప్పుడప్పుడు చడువుకోవడంలో ఎంత ఆనందం ఉండేది.
ఇప్పుడు అంతా ఫోనులూ, దాని నుండే సందేశాలు. ఎదురు చూడడం లేదు. సమయం లేదంటూ చాలా కోల్పోతున్నాం.



1 comment:

  1. ఇది చాలా ఆలోచించదగ్గ నిజం. ఇప్పటి తరంలో ఈ టెక్నొలజిలతో ఎన్నో కోల్పోతున్నాం. ఏం కోల్పోయామో తెల్సుకోటానికి చాలా ఏళ్ళు పట్టొచ్చు. మళ్ళీ పాత రొజుల్లోని కమ్మదనాలు వస్తాయని ఆశిద్దాం.

    గిరిధర్ పొట్టేపాళెం
    http://giri-art.blogspot.com/

    ReplyDelete